నవంబర్ 13న భారత్‌కు ఆంగ్‌సాన్ సూకీ
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు, మానవహక్కుల ఉద్యమకారిణి ఆంగ్ సాన్ సూకీ సుమారు 4 దశాబ్దాల తర్వాత భారత్ పర్యటనకు రానున్నారు. నవంబర్ 13న ఆమె ఢీల్లీ చేరుకోనున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీలోనే సూకీ మకాం వేయనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 14న ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ స్మారకోపన్యాసం చేయనున్నట్లు గురువారం అధికార వర్గాలు పేర్కొన్నాయి.