నవంబర్ 15న జరిగే సెమినార్ ను జయప్రదం చేయండి

వీపనగండ్ల నవంబర్ 07 (జనంసాక్షి)నవంబర్ 15న హైదరాబాదులో జరిగే సెమినార్ పోస్టర్ ఆవిష్కరించిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. వీపనగండ్ల మండలంలో సోమవారం నాడు గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు, సవాళ్లు అనే అంశంపై రవీంద్రభారతిలో జరిగే సెమినార్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షులు వి కృష్ణయ్య కార్యదర్శి ఏ నిరంజన్ ఉపాధ్యక్షులు జక్కుల ఆశన్న సంగినేనిపల్లి సర్పంచ్ ఆర్ మౌలాలి పాల్గొని మాట్లాడడం జరిగింది. సెమినార్కు తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా కేరళ గ్రామీణ అభివృద్ధి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబి రాజేష్, అఖిలభారత కార్యదర్శి బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు, ఉపాధి పనులు చేసిన ప్రదేశంలో రోజుకు రెండుసార్లు ఫోటోలు దిగి అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వ విధానాలు సరికాదని గ్రామంలో 20 పనులే చేపట్టాలనే నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పట్టణాల్లోనూ ఉపాధి పనులను కొనసాగించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రతి గ్రామానికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాలని కూలీలు వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్య లో తరలివచ్చి సెమినార్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.