నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు
న్యూఢిల్లీ : తెలంగాణలో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో 119, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40, రాజస్థాన్‌లో 200, మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. మొత్తంలో ఐదు రాష్ట్రాల్లో 679 శాసనసభ స్థానాలున్నాయని తెలిపారు. తెలంగాణలో కొంతకాలంగా రాజకీయాలు వేడెక్కగా.. తాజా షెడ్యూల్‌తో మరింత రసకందాయకంగా మారనున్నాయి. ఇప్పటికే పధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్న విషయం విదితమే.
తెలంగాణ ఎ న్నికల తేదీలు
నోటిఫికేషన్ : నవంబర్ 3
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ : నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన తేదీ : నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబర్ 15
పోలింగ్ : నవంబర్ 30, ఓట్ల లెక్కింపు : డిసెంబర్ 3