నవనిర్మాణ దీక్షలతో కేంద్రం మోసాలు ప్రచారం చేశాం

వైకాపా రాజీనామాల్లో అర్థం లేదు: మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు,జూన్‌7(జ‌నం సాక్షి): పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర , టీడీపీ నేతలు పరిశీలించారు. గ్రామదర్శిని వేదికతో పాటు సీఎం సందర్శించే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు మంత్రి సోమిరెడ్డి పలు సూచనలు చేసారు.నాయుడుపేటలో చంద్రబాబు నాయుడు పాల్గొనే నవనిర్మాణదీక్ష ముగింపు సభ వేదిక వద్ద ఏర్పాట్లను సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పరిశీలించారు. నాయుడుపేటలో జరుగుతున్న నవనిర్మాణ దీక్ష ముగింపు సభకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మంత్రి అన్నారు. నవనిర్మాణ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైందని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసాన్ని, బీజేపీయేతర రాష్ట్రాలపై వివక్ష కక్షపూరిత చర్యలను ప్రజలకు వివరించామని అన్నారు. ఇప్పుడు రాజీనామాలంటున్న వైకాపా ఎంపీలు నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. 2016లోనే మోదీ ¬దా ఇవ్వలేమని చెప్పినప్పుడు నిద్రపోతున్నారా..అన్నారు. రాజీనామాలు చేశామంటున్నారు కదా..ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారో చెప్పాలన్నారు. జగన్‌ జీవితమంతా సానుభూతి విూదే బతకాలని చూస్తున్నారని విమర్శించారు. అసలు విూ పార్టీ పాలసీ ఏంటి..జగన్‌ పార్టీకి ఉప ఎన్నికలంటే భయం పట్టుకుందన్నారు. నంద్యాలలో జగన్‌ 15 రోజులపాటు వీధివీధి తిరిగినా ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు..మోదీ బృందం విూకు అత్యంత, అంతరంగిక స్నేహితులు కదా..మోదీతో ఎన్నికల కమిషన్‌ కి చెప్పించుకుని ఉప ఎన్నికలు తీసుకురండి..దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక ప్రభంజనం ప్రారంభమైంది.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నేతలు విలువలకు పాతరేశారు..వైకాపా నేతలు అక్కడే తిష్టవేసి వారికి వంత పాడారు.. ప్రజలకు చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను చెప్పుకుని ధైర్యంగా ఓట్లు అడుగుతాం అని మంత్రి వివరించారు.