నవయుగ శతకం పుస్తకం ఆవిష్కరణ

భీమదేవరపల్లి, మండలం అక్టోబర్ (07 ) జనంసాక్షి న్యూస్
 ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం తెలంగాణ సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో కొప్పూర్ గ్రామానికి చెందిన నల్లగొండ సురేశ్ ఆటవెలది ఛందస్సులో రాసిన నవయుగ శతక పుస్తకాన్ని డాక్టర్ కర్రె సదాశివరావు, గ్రామ సర్పంచ్ మాడ్గుల కొంరయ్య ల చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాతూరి రఘురామయ్య మాట్లాడుతూ గ్రంథ సమీక్ష నవయుగ శతకం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ శతకం వేమన శతకం వలె బాగుందన్నారు. ఈ శతకం నేటి కాలపు స్థితి గతులకు అద్దం పడుతుందని, ఏ కాలానికైన ఇది నవయుగాన్ని తెలుపుతుందన్నారు. సభాధ్యకక్షులు డాక్టర్ సదాశివ్ మాట్లాడుతూ నవయుగ శతకం ఎన్ని సంవత్సరాలైన నిలిచిపోతుందని, తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు వచ్చిన ఎల్లకాలం నిలిచేవి శతకం,గేయ ప్రక్రియలు అన్నారు. నల్లగొండ సురేశ్ శతకాన్ని స్వర్గస్తులైన తన తల్లితండ్రలు నల్లగొండ మరియమ్మ-నర్సయ్యలకు అంకితం చేసి వారికి. చిరాయుస్సు పోశారన్నారు. డాక్టర్ ఎదులాపురం తిరుపతి మాట్లాడుతూ కొప్పూర్ లో పంచముఖ హనుమాన్ దేవాలయం, ఇకనుండి నల్లగొండ సురేశ్ అనే కవి ఉంటాడు అని అన్నారు. మాడ్గుల కొంరయ్య నవయుగ శతకం ములుకనూర్ ప్రజా గ్రంథాలయంలో ఆవిష్కరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.శతకంలోని 108 పద్యాలలో ప్రతి పద్యం ఒక ఆణిముత్యం అని కొనియాడారు. కొప్పూర్ సర్పంచ్ గద్ద రాజమణీ సమ్మయ్య మా గ్రామంలో ఒక కవి ఉండడం చాలా గర్వకారణమని శతకంలోని పుటక నిచ్చు తల్లి పుణ్యవతి సకల పనులు సేయు సతియు లలనె ,తనయ పుటక వద్దు మనుషుల కిలయందు నల్లగొండ మాట కల్ల కాదు అనే పద్యాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అప్పని పద్మ, బిక్షపతి, కొత్తకొండ లలిత, నాగరాజు, డాక్టర్ క్రిష్ణ కుమార్, శాతవాహన విశ్వవిద్యాలయం వారి కైతికాల సందేశాలను అందించారు. కైతికాల రూపకర్త గోస్కుల రమేశ్, తెలంగాణ సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు మేడికాల అంజయ్య, కార్యవర్గ సభ్యులు కాల్వ రాజయ్య, సాహిత్యాభిమానులు, తదితరు పాల్గొన్నారు.