నవ నిర్మాణ దీక్ష విజయవంతమైంది

 కేంద్రం ఏపీకి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాం
నాలుగేళ్ల తర్వాత రాజీనామాలు గుర్తుకొచ్చాయా?
దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
విజయవాడ, జూన్‌7(జ‌నం సాక్షి) : టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవ నిర్మాణ దీక్ష రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం చేసిన మోసాన్ని, బీజేపీయేతర రాష్ట్రాలపై కక్షపూరిత చర్యలను ప్రజలకు వివరించామన్నారు. కేంద్రం తీరుపట్ల ప్రజలు మండిపడుతున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ అభివృద్ధి నిరోదక పార్టీగా మారిందన్నారు. ఇప్పుడు రాజీనామాలు అంటున్న వైసీపీ ఎంపీలు నాలుగేళ్లుగా ఏం చేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్‌ జీవితమంతా సానుభూతిపైనే బతకాలనే చూస్తున్నారని, జగన్‌ పార్టీకి ఎన్నికలంటే భయం పట్టుకుందని మంత్రి ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కర్ణాటకలో బీజేపీ నేతలు విలువలకు పాతరేశారని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని అన్ని హావిూలన పూర్తి చేస్తామని మోదీ చెప్పారని, దీంతో తామ నమ్మి ఎన్డీఏలో చేరినట్లు తెలిపారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు 29సార్లు  ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులు చుట్టూ తరిగిన ఫలం లేకుండా పోయిందన్నారు. నాలుగేళ్ల పాటు ఓపిగ్గా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురుచూసిన ఎలాంటి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్నారు. దీనిని తట్టుకోలేక ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చి బీజేపీపై పోరాటం సాగిస్తున్నారన్నారు. ఇంత తెలిసినా ¬దా ఇవ్వాల్సిన కేంద్రంపై జగన్‌, పవన్‌కళ్యాణ్‌లు ఆందోళన చేయకుండా చంద్రబాబు ఎదురు దాడి చేస్తుందన్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేవారు. ఇలాంటి ప్రతిపక్ష పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని తగిణ గుణపాఠం తప్పదని మత్రి వివరించారు.