నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్ : మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది హిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు రుక్మిణి(22) ఆత్మహత్య చేసుకుంది. అత్తమామల వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త, అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.