నాంపల్లిలో వ్యక్తి వీరంగం

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఓ వాహనదారుడు ట్రాఫిక్‌ పోలీస్‌ పై దాడి చేసిన సంఘటన నాంపల్లి తాజ్‌ ఐలాండ్‌ చౌరస్తాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నాడు. దీంతో ట్రాఫిక్‌ పోలీస్‌ తన కెమెరాతో ఫోటో తీశాడు. వెంటనే జాకీర్‌ గమనించి యూ టర్న్‌ తీసుకొని ఆ కానిస్టేబుల్‌ వద్దకు వచ్చి బూతులు తిట్టాడు. అనంతరం కానిస్టేబుల్‌ పై దాడి చేశాడు. కానిస్టేబుల్‌ ముఖంపై పిడిగుద్దులు కురుపించడంతో కానిస్టేబుల్‌ ముక్క నుంచి రక్తం కారింది. వెంటనే జాకీర్‌ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. 50 విూటర్ల దూరంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకొని కానిస్టేబుల్‌ ను ఆస్పత్రికి తరలించారు. వెంటనే నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.