నాకు సెంట్రల్‌ సెక్యురిటీ కావాలి!

– తెలంగాణ సర్కార్‌నుంచి నాకు ప్రాణహాని ఉంది
– రాష్ట్ర డీజీపీపై నమ్మకం లేదు
– అందుకే కేంద్ర సెక్యురిటీ సంస్థల ద్వారా రక్షణివ్వాలని ఈసీని కోరా
– నాయిని బహిరంగంగా చెప్పిన విషయాన్ని ఈసీకి ఫిర్యాదుచేశా
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : తనకు సెక్యూరిటీ కావాలని, కేంద్ర సెక్యురిటీ సంస్థల ద్వారా సెక్యురిటీ కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం
రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిశారు. ఈ సందర్భంగా తనకు సెక్యురిటీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రేవంత్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉందని, రాష్ట్ర డీజీపీపై నమ్మకం లేదని అందుకే  కేంద్ర సెక్యురిటీ సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ గతంలో నాగార్జున సాగర్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ శిక్షణలో పాల్గొన్నారని రేవంత్‌
పేర్కొన్నారని, కాబట్టి ఆయనపై నమ్మకం లేదన్నారు. అంతే కాదు నిండు సభలో ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ చేస్తానన్నారని, ఇటీవల మంత్రులు జగదీష్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, బాల్క సుమన్‌ లు తనను భౌతికంగా అంతమోదిస్తా అని అన్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే తనకు సెక్యురిటీ కావాలని కోరానన్నారు. ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఎల్బీనగర్‌ లో పోటీచేస్తే 10కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారని బహిరంగంగా చెప్పిన విషయంపై ఈసీకీ ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇది లంచం ఇవ్వచూపిన దాని కిందకి వస్తుంది అభిప్రాయపడ్డారు. ఈసీ సుమోటోగా తీసుకోవాలని కోరానని రేవంత్‌ పేర్కొన్నారు. లేదా నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని ఆయన తెలిపారు. ఒక అభ్యర్థి కి 10కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఒక అభ్యర్థికి 28లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలని రేవంత్‌ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని, టీఆర్‌ఎస్‌ను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌ తెలిపారు.