*నాగర్ కర్నూల్ ఎస్సైపై చర్యలు తీసుకోనీ పక్షంలో,జిల్లా ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం-బిఎస్పీ డిమాండ్*

నాగర్ కర్నూల్ రూరల్ జులై01(జనంసాక్షి)
మహేంద్ర నాథ్ చౌరస్తాలో గల బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ)ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ,సంఘాలకు,పార్టీలకు తేడా తెలియకుండా ప్రతిసారి నాగర్ కర్నూల్ ఎస్సై బిఎస్పీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్లు చేయడం ఏంటని ప్రశ్నించారు.గతంలో బీసీ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే,బిఎస్పీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని తెలిపారు.అప్పుడు జిల్లా ఎస్పీ ని కలిసి విన్నవిస్తే అప్పటి కప్పుడు బిఎస్పీ కార్యకర్తలను వదిలి పెట్టారని తెలిపారు.30తారీకు నాగర్ కర్నూల్ స్టేషన్ సిబ్బంది బిఎస్పీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ప్రధానమంత్రి మీటింగ్ ఉంది,దాని గురించి ఎస్సైతో అవగాహన సమావేశం ఉంది,మీరు రండని పిలవడం జరిగింది.అక్కడికి వెళ్లిన బిఎస్పీ కార్యకర్తలతో 3గంటల తర్వాత సంతకాలు తీసుకుని,ఫొటోస్ దింపుకుని మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేశామని ప్రకటించారు.మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు.అంటే నాగర్ కర్నూల్ ఎస్సై పొంతనలేని సమాధానాలు చెప్పడం జరిగింది.దీంతో ఆగ్రహించిన బిఎస్పీ నాయకులు డిఎస్పీ దగ్గరికి,ఎస్పీ పేషి లోకి వెళ్లడం జరిగింది.డిఎస్పీ బిఎస్పీ నాయకులతో చర్చలు జరిపి వదిలి పెట్టడం జరిగింది.స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో,నాగర్ కర్నూల్ ఎస్సై బిఎస్పీ కార్యకర్తలను కావాలనే ఇబ్బంది పెడుతున్నాడని బిఎస్పీ నాయకులు తెలియజేశారు.బిఎస్పీ జాతీయ పార్టీ అని,రాష్ట్రములో మాజీ అడిషనల్ డిజీపీ డా.ఆర్ఎస్పీ నాయకత్వంలో నడుస్తున్నదని తెలిపారు.వారంలోగ నాగర్ కర్నూల్ ఎస్సైపై శాఖ పరమైన చర్యలు తీసుకోకపోతే,జిల్లా ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోనాసి రాంచందర్ అడ్వకేట్,అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్,ప్రధాన కార్యదర్శి కూసునూర్ శ్రీను,బిఎస్పీ తెల్కపల్లి మండల కన్వీనర్లు శివశంకర్,బాలరాజ్,శంకర్,సాయిబాబా బిఎస్పీ నాయకులు బాలరాజ్,అంజి,రమేష్,కురుమూర్తి,రామ్,వెంకటేష్,నాగరాజు,దశరథం,భాస్కర్,నరేందర్,కొమ్ము.శివ,రాజేష్,భాస్కర్ లు పాల్గొన్నారు.