నాగర్ కర్నూల్ యువత మార్పు కోరుకుంటుంది.
బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్.
బిఎస్పీ పట్టణ అధ్యక్షునిగా చింతకుంట కళ్యాణ్ నియామకం.బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షుడిగా చింతకుంట కళ్యాణ్ ను నియమించినట్లు బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షు లు కొత్తపల్లి కుమార్ తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలోని మహేంద్ర నాథ్ చౌరస్తాలో గల పార్టీ కార్యాలయంలో బిఎస్పీ అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు పృథ్వీ రాజ్ ఆద్వర్యంలో నిర్వహించిన నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్పీ పిలుపు అందుకుని యువతరం అంతా స్వచ్ఛందంగా బిఎస్పీ పార్టీ వైపు వస్తున్నారని తెలిపారు. దీంట్లో భాగంగానే తాడూర్ గ్రామానికి చెందిన యువకులు శివ, ఖాసీం, ఆనంద్, రవి, రాజ్ లు కాంగ్రెస్ పార్టీ నుండి బిఎస్పీ పార్టీలో చేరారనీ తెలిపారు.ఇతర పార్టీలు యువకుల కోసం వెతుకుంటూన్నారని, కానీ బిఎస్పీ పార్టీకి ఆ పరిస్థితి లేదని అన్నారు. ముందు ముందు ఇంకా అనేక చేరికలు ఉంటాయని అన్నారు.నాగర్ కర్నూల్ యువత మార్పు కోరుకుంటుందని, ఆ మార్పు బిఎస్పీ తోనే సాధ్యం అనీ తెలిపారు. ఆధిపత్య, దోపిడీ, నిరంకుశ పాలనా నుండి నాగర్ కర్నూల్ ను విముక్తి చేస్తామని వివరించారు.సమీక్షా సమావేశం అనంతరం నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షులుగా చింతకుంట కళ్యాణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలో పార్టీనీ బలోపేతం చేస్తామని నూతనంగా ఎన్నికైన బిఎస్పీ పట్టణ అధ్యక్షుడు చింతకుంట కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు పృథ్వీ రాజ్,కోశాధికారి ఆనంద్, మండల కన్వీనర్లు శివ శంకర్, అంజీ, శంకర్, నాయకులు శ్రీను, బాల నాగులు, లక్ష్మన్, రాజేష్, రాములు, మల్లేష్, బాలస్వామి మరియు బహుజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ రాములు పాల్గొన్నారు.