నాగారం గ్రామాన్ని సందర్శించిన జడ్పీ సీఈవో
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ సందర్శించారు. నాగారం గ్రామపంచాయతీకి విచ్చేసిన సీఈఓ ని సర్పంచ్ బూడిద మల్లేష్ సాదరంగా ఆహ్వానించారు. స్వచ్ఛ సర్వేక్షన్ పనులలో భాగంగా గ్రామపంచాయతీ చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు , పారిశుద్ధ్యం వంటి వివిధ పనులను తనిఖీ చేయడం జరిగింది. గ్రామపంచాయతీ నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేసినందున సీఈఓ గారు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రైతు వేదిక భవనంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారు నాగారం గ్రామానికి అనుకొని ఉన్న పలు గ్రామాల నుండి వచ్చిన 80 మంది మహిళ పురుష అభ్యర్థులకు కుట్టు మిషన్ తాపీ మేస్త్రి శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి జిల్లా పరిషత్ సీఈవో ఎం శ్రీనివాస్ గారు భవన కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపడుతున్న పథకాల గురించి వివరించడం జరిగింది. లేబర్ కార్డు లేని వారు లేబర్ కార్డు ని పొందే విధంగా శిక్షకులు చర్యలు చేపట్టాలని కోరినారు. మహిళలు కూడా కుట్టు మిషన్ శిక్షణ పొంది ఆర్థికంగా కుటుంబాన్ని పోషించే విధంగా తయారు కావాలని ఆకాంక్షించారు ఇట్టి కార్యక్రమంలో మంథని మండల ఎంపీడీవో రమేష్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శిక్షకులు మల్లేష్ సంపత్ సునీత తదితరులు పాల్గొన్నారు.