*నాగార్జునసాగర్ 26 గేట్లుఎత్తివేత

*నిండుకుండల మారిన జలాశయం
*ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది
నాగార్జునసాగర్ (నందికొండ), ఆగస్టు 11,(జనం సాక్షి); శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో  ప్రాజెక్టు అధికారులు సీఈ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మానాయక్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లులను గురువారం మధ్యాహ్నం 1.35 నిమిషాలకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో 4,38,446 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో 3,36,672 లక్షల క్యూసెక్కులుగా ఉంది.ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం  590 అడుగులు కాగా,ప్రస్తుత నీటి మట్టం  588.00 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 2009 తర్వాత మళ్లీ 2022 లో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు.