*నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిని త్వరితగతిన పూర్చడంలో ఎన్ఎస్పి అధికారుల విఫలం.

 సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు*
నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.నాగార్జునసాగర్ ఎడమకాలువ కు గండిపడి పది రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ గండి పూడ్చకపోవటం వలన పంట పొలాలు ఎండిపోతున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు కొదమగుండ్ల నగేష్ లు అన్నారు.శనివారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయం అరిబండి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నిడమనూరు వద్ద గండిపడగా అప్పటినుండి నేటి వరకు పంటలకు నీరు అందక రైతాంగం కష్టాలు పడుతున్నారని గండిని త్వరితగతినపూర్చడంలో ఎన్ఎస్పి అధికారులు విఫలమయ్యారని గండిపడటం వలన రైతాంగం పంట నష్టం ఎదుర్కొంటుందని వెంటనే ప్రభుత్వం రైతులను కౌలు రైతులను గుర్తించి వారికి సహాయం అందించాలని  డిమాండ్ చేశారు.వెంటనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు యుద్ధ ప్రతిపాదన గండి పూడ్చి పంటల నీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నీలా.రామ్మూర్తి,ఎడ్ల సైదులు,చిట్టిబాబు,కొండా లింగయ్య, కోదాటి సైదులు,సట్టు.వెంకన్న,కుర్ర గంగరాజు,ఇంజం సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
Attachments area