నాగార్జున సాగర్ కుడికాలువకు 7వేల క్యూసెక్కుల నీరు!

శనివారం, 14 ఫిబ్రవరి 2015 (జ‌నంసాక్షి)

 Nagarjuna_Dam
నాగార్జున సాగర్ వివాదం ముగిసింది. నాగార్జున సాగర్ కుడి కాలువకు ఏడు వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరింది. కుడి కాలువ నుంచి నీటి విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం శనివారం ఇరు రాష్ట్రాల సీఎంలు గవర్నర్‌‌తో భేటీ సందర్భంగా ముగిసిన సంగతి తెలిసిందే.  
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ దగ్గర భేటీ అయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి నీరు విడుదల చేయాలన్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. 
నిలిచిపోయిన ఏపీ జల విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు పచ్చజెండా ఊపుతూ.. కుడి కాలువ నుంచి 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని 4, 5 గేట్లను తెలంగాణ అధికారులు ఎత్తివేశారు.