నాగ్‌పూర్‌లోనూ అంతే.. ఈడెన్ తరహాలోనే పిచ్ ఉంటుందన్న క్యూరేటర్
నాగ్‌పూర్, డిసెంబర్ 11: ఇంగ్లాండ్‌తో సిరీస్ ప్రారంభం నుండీ స్పిన్ పిచ్‌లే కావాలంటోన్న భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి మరో నిరాశను కలిగించే విషయం… గురువారం నుండి జరగనున్న చివరి టెస్ట్ కోసం నాగ్‌పూర్ పిచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ తరహాలోనే ఉంటుందని సమాచారం. అహ్మాదాబాద్‌లో గెలిచినా కూడా పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ధోనీ, తర్వాత ముంబై పిచ్‌పై మాత్రమే శాటిస్‌ఫై అయ్యాడు. అక్కడ ఓడినప్పటకీ అలాంటి పిచ్‌లే కావాలంటూ ఈడెన్ క్యూరేటర్‌ను కోరాడు. దీనికి ఈడెన్ క్యూరే టర్ నిరాకరించడం, తర్వాత నెలకొన్న వివాదం అందరికీ తెలిసిందే. మూడున్నర రోజుల్లోనే ముగి సిపోయే విధంగా పిచ్ తయారు చేయాల న్నది ధోనీ ప్రధాన డిమాండ్. అయితే నాగ్‌పూర్ పిచ్ మాత్రం పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండ దని తెలుస్తోంది. నిన్ననే ఇక్కడకి చేరుకున్న రెం డు జట్లూ ఇవాల్టి నుండే ప్రాక్టీస్ మొదలు పెట్టా యి. ధోనీకి అనుకూలంగా ఉండే పిచ్ తయా రు చేయాలని బోర్డు నుండి స్పష్టమైన ఆదేశాలు న్నప్పటకీ ఎటువంటి మార్పులు చేసారనేది విద ర్భ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించడం లేదు. అయితే పూర్తి స్పిన్‌పిచ్ మాత్రం కాదని సమాచా రం. వికెట్ పొడిగా ఉండడంతో కొంత బౌన్స్ ఉంటుందని నాగ్‌పూర్ గ్రౌండ్‌వర్గాలు తెలిపాయి. ఇక్కడి పిచ్‌పై మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింటిలో గెలిచి, ఒక టెస్టులో ఓడింది. గత రెండు మ్యాచ్‌లూ నాలుగురోజుల్లోపే ముగిసా యి. నాగ్‌పూర్‌పిచ్ బౌలర్లకు స్వర్గ ధామంగా ఉంటుంది. 2010లో సౌతాఫ్రికాతో జరి గిన మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ బౌలింగ్ కార ణంగా భార త జట్టు మ్యాచ్ కోల్పోయింది. అయి తే ఈ ఏడా ది కివీస్‌పై ఇదే చోట జరిగిన మ్యాచ్ లో భార త్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు 7 వికెట్లు తీస్తే స్పిన్నర్లు 11 వికెట్లు పంచుకు న్నారు. ఈ నేపథ్యంలో చివరి టెస్టుకు ఎలాంటి పి చ్ తయారవుతుందో అనేది ఆసక్తికరం గా మారిం ది. ఇప్పటికే రెండు వరుస పరాజయాల తో సిరీస్ కోల్పోయే ప్రమాదం టీమిండియా ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిస్తేనే పరువు నిల బడుతుంది.