నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): కామేపల్లి మండలంలోని మద్దులపల్లిలో కామేపల్లి ఎక్సైజ్ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, 900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని ఎక్సైజ్ ఎస్సై చిరంజీవులు తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలావుంటే గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగయ్య, శ్రీరాములు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గీత కార్మికులు మార్చి 7న ఖమ్మం తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంచాలని, ఆసరా పింఛన్లు ఇవ్వాలని, మన్యం ప్రాంతాల్లో కల్లు సొసైటీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.