నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం

           ఎంపీపీ స్వరూప మహేష్
రుద్రంగి సెప్టెంబర్ 2 (జనం సాక్షి);
రుద్రంగి మండలం గైదిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న  విద్యార్థులకు యూనిఫామ్ లను ఎంపీపీ గంగం స్వరూప మహేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ…. నాణ్యమైన విద్యను అందించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫామ్ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు స్కూల్ బుక్స్ తో పాటు మధ్యాహ్న భోజనం వంటి అనేక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఇట్టి అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత రవి తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.