వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టీ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్‌నాయక్ తోపాటు కార్యకర్తలు,పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.