నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్ ప్రభంజనం
హైదరాబాద్ : మొన్న నాన్నకు ప్రేమతో కేటీఆర్ గ్రేటర్‌ను ఇస్తే ఇవాళ మామకు ప్రేమతో నారాయణ్‌ఖేడ్‌ను కేసీఆర్ చేతిలో పెట్టాడు హరీష్‌రావు. కాంగ్రెస్ కోటను బద్దలుకొట్టిన గులాబీదళం దశాబ్ధాలుగా సాగుతున్న రెండు కుటుంబాల పాలనకు స్వస్తి పలికింది. ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించింది టీఆర్‌ఎస్.
అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా….
అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలో గులాబీ విజయ పతాకం ఎగురవేసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డి 53 వేల 625 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. భూపాల్‌రెడ్డికి మొత్తం 93 వేల 076 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39 వేల 451 ఓట్లు, టీడీపీ అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 14 వేల 787 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ తంటాలు పడి డిపాజిట్ దక్కించుకోగా టీడీపీ డిపాజిట్ గల్లంతయ్యింది.
మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ….
మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి అన్ని రౌండ్లలోను స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఏ దశలోను కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది.
మంత్రి హరీష్ రావుకు అభినందనలు…
మొదటి నుంచి నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికను భుజాన వేసుకొని పార్టీకి విజయాన్ని అందించిన హరీష్‌రావుకు అభినందనలు తెలిపారు మంత్రి
60 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా….
60 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని అన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి . వరంగల్ , గ్రేటర్ ఎన్నికల్ల్లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో నారాయణ్ ఖేడ్ లో అదే జరిగిందన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుతున్నారని.. గత ప్రభుత్వాల పాలనసరిగా లేకనే.. ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకున్నారన్నారు. ఇన్నాళ్లు నిర్భందంగా ఓటును వేసిన ప్రజలు.. ఇన్నేళ్లకు స్వేచ్ఛను కోరుకున్నారన్నారు పద్మాదేవేందర్ రెడ్డి.ఇచ్చిన హామీలను ప్రభుత్వం చేసి తీరుతుందన్నారు.