నార్వే దంపతులకు శిక్ష కరారు

చంద్రశేఖర్‌కు 18నెలలు..

అనుపమకు 15నెలలు…..

అప్పీలుకు అవకాశం………

ఓస్లో: డిసెంబర్‌ 4,(జనంసాక్షి):

కుమారుడిని హింసించారనే ఆరోపణలపై ఎలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. చంద్రశేఖర్‌, అనుపమ దంపతులకు జైలు శిక్ష విదిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చంద్రశేఖర్‌కు 18నెలలు, అనుపమకు 15నెలల జైలుశిక్ష ఖరారు చేసింది. పిల్లలను మందలించారనే ఆరోపణలపై జైలు పాలైన నార్వేలోని తెలుగు దంపతుల కేసు కొత్త మలుపు తిరిగిన విషయం విదితమే.  చంద్రశేఖర్‌, అనుపమల కుమారుడిని వారు వాతలు పెట్టినట్లు ఆరోపించారు. పిల్లవాడి ఒంటిపై కాల్చిన మరలు, మచ్చలు ఉన్నాయని, బెల్టుతో కొట్టారని, కాల్చిన లోహంతో వాతలు పెట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్‌ అధిపతి కుర్డ్‌లిర్‌ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను తెలుగు దంపతులు వల్లభనేని చంద్రశేఖర్‌, అనుపమ ఖండించారు. వీరి తరపు న్యాయవాది మార్టే బ్రోట్రోవమ్‌  కోర్టు తీర్పునకు ముందు మాట్లాడుతూ పిల్లలను వారు బాధించలేదని, పిల్లవాడి పట్ల సరిగా వ్యవహరించి ఉండకపోవచ్చేగాని  బాధించలేదని, దంపతులను నార్వేలోని జైలులో పెట్టడం తప్పని ఆమె అన్నారు. ఈ కేసు విషయంలో అనుపమ, చంద్రశేఖర్‌ బంధువులు, భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో వీరి బంధువులు అప్పీలుకు పై కోర్టుకు వెళ్తామని వారు తెలిపారు.