నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దే: హోంమంత్రి సబితా
వరంగల్: ఖైదీలకు క్షమాభిక్షపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా మలికొండ నూతన పోలీస్‌స్టేషన్ భవానాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆందోళనకారులపై నమోదైన కేసులను ఎత్తివేసినట్లు తెలిపారు.