నాసిరకంగా మన ఊరు-మనబడి పనులు.

-నాసిరకంగా నిర్మాణాలు.
-నాణ్యతలేని ఇసుక, కంకర.
-అధికారుల పర్యవేక్షణ లోపం.
-జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేకతార్.

పినపాక, సెప్టెంబర్ 7 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసాన దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యకు, వసతుల రూపకల్పనకు మన ఊరు – మన బడి అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపు దాల్చి లక్షల రూపాయల నిధులు సమకూర్చుతుంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మన ఊరు- మనబడి పథకం కింద నిధులు మంజూరు ఐనా పాఠశాలలో ప్రతి ఒక్క పనిలో నాణ్యత కి పెద్దపీట వేయాలని, నాసిరకం నిర్మాణాలు చేయటానికి ఎటువంటి ఆస్కారం లేకుండా సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ప్రతి మీటింగ్ లో ఉన్నతాధికారులను హెచ్చరిస్తున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా పినపాక మండలం,దుగినేపల్లి గ్రామంలో ఉన్న సుమారు 30 లక్షల రూపాయల పైచిలుకు వ్యయంతో పాఠశాల మరమ్మతులు చేపట్టారు. నిర్మాణ పనులు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు పనిచేస్తున్న ప్రదేశంలో లేకపోవడం వారి చిత్తశుద్ధికి దర్శనం. నాసిరకం ఇసుక, నాసిరకం కంకర,సిమెంటు తక్కువతో నిర్మాణాలు చేపడుతున్న పర్యవేక్షించాల్సిన అధికారులు మౌనం దాల్చి ఉండటం వెనుక అంతర్యం ఏమిటి అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.