నాసిరకం పనులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): కొమురం భీం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వగా ఆ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న పునరవాస గ్రామాల నిర్మాణం సైతం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శుల ఉన్నాయి. పునరావాస గ్రామాల్లో నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడంతో అవి కూలిపోతున్నాయి. . కొమురం భీం ప్రాజెక్టు ముంపు పునరావాస కాలనీలోని నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. ముంసు బాధితుల పునరావాస కాలనీలలో నివాసాలు ఏర్పర్చుకోక ముందే రోడ్లు పగుళ్లు తేలగా మురికి కుప్పకూలాయి. అధికారుల, కాంట్రాక్టర్ల అవినీతి వల్ల పునరా వాస గ్రామాల్లో అభివృద్ధి పనుల బీళ్లు వారుతున్నాయి. బాధితుల పునరావాస కాలనీలో సిమెంటు రోడ్లు, మురికి కాలువలు పాఠశాలలు, అంగన్‌ వాడీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి.ఆసిఫాబాద్‌ మండలంలోని ఆడ గ్రామం వద్ద కొమురంభీం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ఆడ, వాడిగూడ

నిషాని, స్కావర్‌ బెడ, పిప్రి, రింగన్‌ గాట్‌ గ్రామాలు ముంపున గురయ్యాయి అడలోని నాలుగు బ్లాక్‌ లకు సాలెగూడ , మాణిక్‌ గూడ, వాడిగూడ పునరావాస కాలనీలో నిర్మాణ పనులు చేపట్టారు. పనుల్లో నాణ్యతాలోపం సిమెంటు రోడ్లు,మురికి కాలువల నిర్మాణ పనుల్లో అవినీతి పారుతోంది. ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేపట్టారు. నాసిరకం కంకర, ఇసుకతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో రోడ్లు పగుళ్లు తేలగా, మురికి కాలువలు కూలిపోయాయి. ఇంజనీరింగ్‌ అధికారుల ఎస్టిమేట్ల కొలతల ప్రకారం నిర్మించాల్సిన డ్రైనేజీలను కాంట్రాక్టర్లు తమకు తోచిన విధంగా నిర్మించడంతో ఒక్క బొట్టు నీరు కూడ డ్రైనేజీల నుంచి పోవడం లేదు. వాడిగూడ కాలనీలో మురికి కాలువలన్ని వరదమట్టితో పూర్తిగా పూడుకు పోయాయి. కాలనీల్లో నీటి ఎద్దడి ముంపు కాలనీల్లో నీటి ఎద్దడి నెలకొంది. బోరు బావులు ఉపయెగించక ముందే చెడిపోయాయి. దీంతో కాలనీలోని బాధితులు నీటి కోసం తీవ్ర కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది.