నా జీవితంలో మరుపురాని ఘట్టం… ‘వస్తున్నా మీకోసం’
తెదేపా అధినేత చంద్రబాబు
హైదరాబాద్ : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. తన రాజకీయ జీవితంలో మరుపురాని ఘట్టం ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర అని పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని చెప్పారు. రాష్ట్రం, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు.