నా జీవితం మునుగోడు ప్రజలకు అంకితం
1000 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేస్తా
– పింఛన్ల పేరిట కేసీఆర్ ఇచ్చేది చారణ దోచుకునేది బారణ
– ఓటర్లు ధర్మం వైపు ఉండి కమలం ను గెలిపించండి
– డబ్బులకు అమ్ముడుపోయి బతుకులను ఆగం చేసుకోవద్దు
– మునుగోడు ఉపేంది ఇక ఆషామాషీ కాదు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
నా జీవితం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అంకితం అంటూ మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా
మునుగోడు నియోజకవర్గం పరిధిలోని కలవలపల్లి, బిరెల్లి గూడెం, పులి పరిపుల, జనస్థాన్ పల్లి, గూడపూర, కొరటికల్ గ్రామాలలో ప్రచార కార్యక్రమాలలో ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు ఇవని కారణంగా తాను రాజీనామా చేసి అభివృద్ధి కోసం బిజెపి పార్టీలో చేరానని ప్రకటించారు. తెరాస ప్రభుత్వం పేద ప్రజలకు పింఛన్ రూపం లో ఇచ్చేది చారణ అయితే గుంజేది భారణా అన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. డబ్బులు ఆశను ఆకర్షించకుండా ధర్మం వైపు ఉండి బీజేపీ ని గెలిపించాలని ఎన్నిక కేవలం మునుగోడు నియోజకవర్గంకే కాకుండా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ముడిపడి ఉందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. రాష్ట్ర మంత్రులు సమస్యలు విన్నవించుకోవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వారు మునుగోడు నియోజకవర్గం లో గడపగడపకు దేహి అంటూ ఓట్లు అడుగుకుంటున్నారని ఏద్దేవా చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని రాజీనామా చేసిన ఘనత కోమటిరెడ్డి సోదరులదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ ఉద్యోగాలు వస్తాయని యువత ఎంతో ఆశపడ్డారని, కాని జరిగింది కెసిఆర్ కుటుంబానికి మాత్రం పూర్తిస్థాయిలో పదవులు సమకూరాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకుండా ఊరు ఊర మద్యం బెల్ట్ షాపులు పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలను మద్యానికి బానిసలు చేసి కుటుంబాలను రోడ్లపాలు చేస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా తెరాసలో ఉన్న బడా బాబులకు వందల ఎకరాల భూస్వాములకు రైతుబంధు పేరిట లక్షల రూపాయలను దోచిపెడుతున్నారని విమర్శించారు. వాస్తవంగా రైతు వ్యవసాయం చేసే రైతులకు కలుగుతున్న ఇబ్బందులు కెసిఆర్ కు పట్టవన్నారు. ఈరోజు కేటీఆర్ ప్రచారానికి వచ్చి మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరని అన్నారు. అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం ఉత్సవ విగ్రహాలని, ప్రశ్నించే దమ్ము ఎ ఒకరికి లేదని విమర్శించారు.
రాజగోపాల్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో, కోలాటాల ప్రదర్శన తో ఘన స్వాగతం పలికారు.
ప్రచారంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగే.శోభ, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.