.నా భార్య దేశం విడిచివెళ్దామంటోంది
– అసహనంపై అమీర్ సంచలన వ్యాఖ్యలు
ముంబై నవంబర్ 23 (జనంసాక్షి): దేశంలో పెరుగు తున్న అసహనం రచయితలు, సైంటిస్టులు తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటుడు అవిూర్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దిన పత్రిక అత్యత్త ప్రతిష్టత్మకంగా ఇచ్చే రామనాథ్‌గోయంకా మెమోరియల్ అవార్డు వేదికపై అమీర్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. తన చిన్నారుల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందన్నారు. దేశం వదిలిపెట్టి వేరేదేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని చెప్పారు. సత్యమేవజయతే కార్యక్రమంతో దేశంలో కదలిక తెచ్చిన అమిర్‌ఖాన్ వ్యాఖ్యాలు మిగతా నటులు, మేధావులపై ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది. రచయితలు, దళిత, ముస్లింలపై జరుగుతున్న దాడులపై ప్రధాని నోరు విప్పక పోవడంపై ఒక్కొక్కరుగా మేధావులు నోరు విప్పల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో అసహన పరిస్థితులపై అవిూర్ వ్యాఖ్యలతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరగనుంది.