నిండుకుండలా కడెం ప్రాజెక్ట్
నిర్మల్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి వరదనీరు రాకడ కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌లోకి 919 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తి 13,122 క్యూసెక్యుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.150 అడుగు ల నీటిమట్టం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పరిస్థితిని సవిూక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. పైఅధికారుల ఆదేశాల మేరకు నీటి నిల్వ చేస్తూ మిగతా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.