నిండు గర్భిణీలను జంపన్న వాగు దాటించి సిహెచ్సి ఏటూరునాగారం హాస్పిటల్ కు తరలించిన ములుగు జిల్లా పోలీస్ రక్షక బృందం-అభినందించిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్


ఏటూరు నాగారం (జనం సాక్షి) జూలై. 19
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వరద ప్రాంతాలలో హుటాహుటిన సహాయ పునరావాస చర్యలు చేపడుతున్న ములుగు జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది, పోలీస్ శాఖలో ఉన్న డిజాస్టర్ అండ్ రెస్క్యూ ఫోర్స్ టీం నేడు ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన డబ్బా కట్ల సునీత,చేరుకల శ్రీమతి అనే ఇద్దరు గర్భిణీ స్త్రీలను జంపన్న వాగు దాటలేక ఇబ్బందులు పడుతుంటే ములుగు జిల్లా పోలీస్ డిజాస్టర్ అండ్ రెస్క్యూ టీం వద్ద కలిగిన అత్యాధునిక రబ్బర్ బోట్ లో వారిని రక్షించి సిహెచ్సి ఏటూరునాగారం హాస్పిటల్ కు సురక్షితంగా తరలించడం జరిగింది.ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నవారు ఏఎస్పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్, సిఐ రాజు ఏటూరునాగారం, ఎస్ ఐ ఏటూరునాగారం కృష్ణప్రసాద్, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ రెస్క్యూ టీం సిబ్బంది పాల్గొన్నారు.