నిందితుడికి రిమాండ్
మెదక్, నవంబర్ 9: మెదక్ రూరల్ సర్కిల్ పరిధి పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మేనత్తను హత్య చేసిన అల్లుడిని రిమాండ్‌కు చేసిినట్లు రూరల్ సిఐ కె.రామకృష్ణ తెలిపారు. శుక్రవారంనాడు స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్న తనను దూరంచేస్తోందని రఘవీర్ భావించి అత్తను హత్య చేయాలని పథకం పన్ని ఈ దారుణానికి ఒడిగట్టాడు. శెర్ల రాంకృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.