నిజాం చక్కెర ఫ్యాక్టరీ ఏమైనట్లు

మెదక్‌,జూలై20(జ‌నం సాక్షి): దేశ ప్రజలు సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న 2013 భూసేకరణ చట్టానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, రాష్ట్రంలోని తెరాస సర్కారు తూట్లు పొడుస్తున్నాయని రైతుసంఘం జిల్లా కన్వీనర్‌ లచ్చాగౌడ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌ సవిూపంలోని ఏకైక రైతు ఆధారిత పరిశ్రమ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి సాకుతో ప్రజల, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు.