నిజాయితీ చాటిన యువకుడు సామూయేల్

అభినందించిన ఎస్సై రాజు కుమార్
మాహాదేవపూర్ ఆగస్ట్ 28 ( జనంసాక్షి)
మాహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఈదునూరి సామూయేల్ శనివారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో తన పనుల నిమిత్తం మార్కెట్ దారి గుండా వెళ్తుంటే ఆ యువకునికి .అర్థ తులం బంగారి గొలుసు దొరకడంతో  తనకి దొరికిన ఆ బంగారి గోలుసును స్థానిక ఎస్సై రాజు కుమార్ కి అందించాడు  తన నిజాయితీ ని చాటిన యువకుడిని  ప్రశంసించి అభినందించారు.  సేవ గుణం ఉన్న యువకునికి స్థానికి సర్పంచ్ శ్రీపతి బాపు  కూడా అభినందించారు. ఇలాంటి బాద్యత గల యువకులు సమాజానికి  ఎంతైనా అవసరమని పలువురు అభినందించారు .ఎస్సై రాజు కుమార్ యువకునికి దొరికిన గొలుసు పై విచారించాగ బొమ్మపూర్ గ్రామానికి చెందిన  నగరపు రవి . అని నిర్దారించి వారికి అందజేశారు