నిట్ లో 3వ ర్యాంకు సాధించిన టాక్లి విద్యార్థి 

గంగులే రిషికేషను ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు…

 

సరస్వతి పుత్రుడనీ అభినందించిన బాసర మండల ప్రజలు….

 

బాసర, అక్టోబర్ 01(జనంసాక్షీ) నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన టాక్లీ గ్రామానికి చెందిన గంగూలీ రుషికేశ్ ఇటీవలే నిర్వహించిన నీట్ పరీక్షల్లో భారత దేశములోనే 3వ ర్యాంక్ సాధించి సోమవారం తమ సొంత గ్రామమైన టాక్లీ కి రావడంతో గ్రామస్థులు అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలువురు మాట్లాడుతూ చిన్న పల్లెటూరికి చెందిన రుషికేశ్ ఇంత గొప్ప ర్యాంకు సాధించి టాక్లి గ్రామం పేరును ప్రంచానికి పరిచయం చేశాడని కొనియాడారు.రుషికేశ్ అంతటితోనే ఆగకుండా దేషంలోనే గొప్ప సైంటిస్ట్ గుర్తిపు పొందాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.అనంతరం రుషికేశ్ మాట్లాడుతు గ్రామంలో మీరు చూపించిన అభిమానం నేనెప్పుడూ మరవలెనని నా పరుగు అంతటితోనే కాదని మా నాన్నా ఆశలు ఆశయాలు ఇంకా పెద్దగా ఉన్నాయని అవి నెరవేరేలా కష్టపడి మన ఊరికి మండలానికి జిల్లాకి దేశానికే మంచి పేరు తెచ్చే విష్ణగా కష్టపడి చదువుతానని పేర్కొన్నాడు. అలాగె విద్యార్థులు కష్టపడి,ఇష్టపడి చదవాలని పరీక్షలు అని భయపడకుండా మన లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించాడు.తండ్రికి దగ్గ తనయుడు అంపించుకున్న టాక్లి నివాసి గంగులే రుషికేశ్ తండ్రి ఐఐటీ  లో  ర్యాంక్ సాధిస్తే తనయుడు  నిట్ లో ఏకంగా దేశంలోనే 3వ ర్యాంక్ సాధించి చదువుల తల్లి కొలువైన బాసర మండలంలోని టాక్లి గ్రామం పేరును ప్రపంచానికి పరిచయం చేశాడు. రుషికేశ్ తో పాటు ఇంకా ముగ్గురికి సమానమైన మార్కులు వచ్చినప్పటికీ నియమాలకు లోబడి విద్యార్థుల వయస్సు ఆధారంగా రుషికేశ్ కు 3వ ర్యాంకు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.రుషికేశ్ తండ్రి నాగభూషన్ 1997 లో ముంబై ఐఐటి లో ర్యాంక్ సాధించగా అనంతరం ఉద్యోగరీత్యా బెంగుళూర్ లో స్థిరపడ్డారు.ఇప్పుడు నిట్ లో రుషికేశ్ దేశంలోనే 3వ ర్యాంక్ సాధించడం గర్వకారణం.ఈ సందర్భంగా గ్రామస్థులు వారి కుటుంబసభ్యులకు అభినందనలు తెలుపుతూ నేటి యువకులకు ఆదర్శప్రాయుడు మి మనవడు అని రుషికేశ్ తాతయ్య గంగులే గంగాధర్ పటేల్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులతో పాటు మెడలోని పలు గ్రామాల ప్రజలు అలాగే పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా వందల మంది ప్రజలు ప్రముఖులు సహితం హజరై అభినందించారు.