నిత్యం ప్రజాసేవ గురించి ఆలోచించే సభాపతిని మరిచిపోవద్దు :- పత్తిరాము

 

రుద్రూర్(జనంసాక్షి):
రుద్రూర్ మండల కేంద్రనికి చెందిన దక్కే ప్రభాకర్ కు కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక వైద్యం కోసం నానా అవస్థలు పడ్డాడు, తన ఆర్థిక పరిస్థితి బాగలేక పోయిన అప్పు చేసి మరీ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేసుకున్నాడు, బాధితుడి ఆర్థిక పరిస్థితి గురుంచి తెలిసిన మాజీ విండో చైర్మన్ పత్తి రాము, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి , రాష్ట్ర సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా 60000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం రోజున తెరాస కార్యకర్తల సమక్షంలో అందించారు .ఈ సందర్భంగా పత్తిరాము మాట్లాడుతూ , పేద మరియు మద్య తరగతి కుటుంబల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు పూర్తి భరోసా ఇస్తున్నదని, అనారోగ్య కారణాలతో ప్రైవే టు దవాఖానల్లో చికిత్స చేయించుకున్న పేదలు ఆర్థికంగా ఇబ్బందిపడొద్దనే తెరాస ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సీఎం కేసీఆర్‌ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
నిత్యం ప్రజాసేవ గురించి ఆలోచించే బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత పోచరం శ్రీనివాస్ రెడ్డిని ప్రజలు మరిచిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ విండో చైర్మన్ పట్టిరాము, ఒరికే చిన్న గంగారాం, బందెలా వీరయ్య, లాలెందర్, కమ్మరి సాయిలు తదితరులు పాల్గొన్నారు