నిధుల కేటాయింపులో ప్రభుత్వం విఫలం.
మరిపెడ: ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో దళిత జనాభాకు అనుగుణంగా నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని కేవీపీఎన్ డివిజన్ కన్వీనర్ అయినాల పరశారాములు విమర్శించారు. కేవీపీఎన్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 30.31 తేదీల్లో స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.