నిప్పులా బయటపడతా : జగదీశ్‌రెడ్డి

నల్లగొండ, మార్చి 20 : తనపై వచ్చిన ఆరోపణల నుంచి నిప్పులా బయటపడతానని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంజినీరింగ్‌ కాలేజీలపై కఠినంగా వ్యవహరించిన తనకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. విద్యుత్‌శాఖలో అవినీతి నిర్మూలనపై దృష్టి సారిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు కృషి చేస్తామన్నారు.