నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

 

– డీజే వాహనాన్ని స్టేషన్ కు తరలించిన ఎస్సై విజయలక్ష్మి

చండ్రుగొండ జనంసాక్షి (సెప్టెంబర్ 08) : నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని తుంగారం లో జరిగిన శోభాయాత్రలో ఎలాంటి అనుమతులు లేకుండా డీజే నిర్వహించిన వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతి యుత శోభాయాత్ర కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.