నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్‌ఐ సుబ్బారావు
మార్కాపురంటౌన్, జూలై 15 :
పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో పట్టణ ఎస్‌ఐ బివివి సుబ్బారావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్ బస్సులు కండీషన్‌లో ఉంచు కోవాలని, డ్రైవర్లందరికీ లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని, బస్సు కెపాసిటీకి మించి పిల్లలను ఎక్కించ రాదని, ఫుట్‌బోర్డుపై పిల్లలను నిలబెట్టరాదని, పిల్లలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు వహించే టప్పుడు విధిగా ఒక వ్యక్తిని నియమించాలని ఎస్‌ఐ సూచించారు. బస్సులకు సంబంధించిన అన్ని పేప ర్లు అందుబాటులో ఉంచుకోవాలని అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఎస్‌ఐ సుబ్బారావు సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు పెట్టడం, వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని కావున తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన విద్యాసంస్థల యాజమాన్యంతో వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో ఎపిటిసిఎ జిల్లా అధ్యక్షులు పి చెంచిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కెజి ప్రకాశ్, కార్యదర్శి కె రంగయ్య, అన్ని పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.