నిమజ్జనంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్ యంత్రాంగం
హుస్సేన్‌సాగర్‌లో ప్రశాంతంగా ముగిసిన క్రతువు
సోమవారం ఉదయం వరకు 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం
వ్యర్థాల తొలగింపు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పారిశుద్య పనులు
హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): జంటనగరాల్లో గణెళిశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అతిపెద్దదైన నిమజ్జనం ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగాయి.
హుస్సేన్‌సాగర్‌లో గణెళిశ్ నిమజ్జనం సోమవారం ఉదయం వరకు కొనసాగింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్ వద్ద గణనాథుల నిమజ్జనం జరిగింది. ఉదయం 6 గంటల వరకు హుస్సేన్ సాగర్‌లో 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇకపోతే నిమజ్జన వ్యర్థాలను తొలగించే పనిలో జిహెచ్‌ఎంసి పడింది. వ్యర్థాలను తొలగించడంతో పాటు, ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు కార్యాచరణ చేపట్టారు.
నిమజ్జనం ఆదివారమే ఉన్నప్పటికీ.. ఎక్కువ సంఖ్యలో గణనాథులు తరలిరావడంతో నిమజ్జనం పక్రియ రెండోరోజూ కొనసాగింది. ఇందుకు సహకరించిన ప్రజలు, మండపాల నిర్వాహకులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్‌లు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణెళిశ్ వేడుకలకు మూడు కమిషనరేట్లలో 35 వేల మంది బందోబస్తు, సుమారు 2.70 లక్షల సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకంగా నిమజ్జనోత్సవాల కోసం అత్యాధునిక టెక్నాలజీ కల్గిన సీసీ కెమెరాలను ఉపయోగించారు. సుమారు ఒక వెయ్యి వరకు ప్రత్యేక కెమెరాలను ఉపయోగించారు. ఎప్పుడు లేని విధంగా ఆదివారం ఉదయానికే వేల సంఖ్యలో గణనాథులు నిమజ్జనమయ్యారు. గత ఏడాది మాదిరిగానే ఖైరతాబాద్ బడా గణెళిశ్‌డిని ఉదయం వేళల్లోనే నిమజ్జనానికి తరలించి, మధ్యాహ్నం 12.55 నిమిషాలకు, ఎన్టీఆర్‌మార్గ్‌లోని క్రేన్ నంబర్ -6 వద్ద నిమజ్జనం చేశారు. బాలాపూర్ గణెళిశ్‌డు కూడా మధ్యాహ్నం వరకు చార్మినార్ ప్రాంతం దాటి, అబిడ్స్‌కు చేరుకొని సాయంత్రానికి నిమజ్జనం పూర్తి అయ్యింది. ప్రజల సహకారం అన్నీ కలిసి వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయింది. నాలుగేండ్ల స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఇన్సిండెట్ ఫ్రీగా వేడుకలు పూర్తి అయ్యాయి. హుస్సేన్‌సాగర్‌లో శనివారం రాత్రి నుంచే నిమజ్జనోత్సవం జోరందుకుంది. ఏడాది ఎవరూ ఉహించని విధంగా నిమజ్జన కార్యక్రమం వేగంగా జరిగింది. స్వచ్ఛందంగా మండపాల నిర్వాహకులే నిమజ్జనానికి త్వరగా విగ్రహాలను తరలించారు. హుస్సేన్‌సాగర్‌లో శనివారం రాత్రి నుంచి సోమవావారం ఉదయం 7 గంటల వరకు 8,895 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. హుస్సేన్‌సాగర్‌లో ఈ ఏడాది మొత్తం 25 వేల వరకు విగ్రహాల నిమజ్జనం జరుగగా, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మరో 25 వేల విగ్రహాలు వివిధ చెరువుల్లో నిమజ్జనం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి పితృపక్షం ప్రారంభం కానుండడంతో ఈ సారి వేగంగా నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఇందుకు మండపాల నిర్వాహకుల్లో అవగాహన కల్పించారు. 18 కిలోవిూటర్ల పొడవునా కొనసాగే ప్రధాన ర్యాలీతో పాటు, నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల్లో ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల(సీసీసీ)ను ఏర్పాటు చేశారు. వీటికి తోడు ఆయా జోన్లలోను కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి నుంచి సీసీ కెమెరాలతో పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. సిటీ పోలీస్ కమిషనరేట్
కార్యాలయంలో సీసీసీ నుంచి నగర వ్యాప్తంగా నిర్వహించిన శోభాయాత్రలను పరిశీలించి, క్షేత్ర స్థాయిలోని సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిచ్చారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ముగ్గురు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్‌లు నిమజ్జనం కొనసాగుతున్న తీరును ఏరియల్ సర్వేతో పరిశీలించారు.