నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

నిమజ్జనం ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలి

* శోభయాత్రలో జాగ్రత్తలు పాటించాలి

* బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
ప్రజలు గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు సూచించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ ప్రభుత్వ అధికారులు చూసుకోవాలని అన్నారు. శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని అన్నారు. శోభయాత్రలో తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. నిమజ్జనానికి వెళ్లేటప్పుడు విగ్రహాలు విద్యుత్ వైర్లకు తగలకుండా అప్రమత్తంగా సంబంధిత ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే రోడ్లపై గుంతలు
ఉన్న చోట వాహనం అదుపుతప్పకుండా నెమ్మదిగా వెళ్లాలని గుంతలు ఉన్నచోట మున్సిపల్ , రెవెన్యూ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ రావు సూచించారు. ముఖ్యంగా శోభయాత్రకు ముందే రూట్‌మ్యాప్‌ను పకడ్బందీగా పరిశీలించాలని , త్వరగా శోభయాత్ర ముగించుకోవాలని
ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుల నిబంధనలు, సూచనలు పాటించాలని అన్నారు. సంయమనంతో ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు.