నియంణ్ర కొనసాగించడంలో ప్రభుత్వం విఫలం
నర్సంపేట :
ఆయిల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కొరవడందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి మద్దికాయల అశోక్ ఆరోపించారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఎంసిపిఐ(యు) పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ కంపెనీలను 4.6 పైసలు పెంచమని కోరితే కేంద్ర ప్రభుత్వం ఏకంగా 8.51 పైసలను పెంచిందని పేర్కొన్నారు.ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల నష్టపోయేది పేదలేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు గాదగోని రవి, కన్నం వెంకన్న, జగన్, సందీప్, తేజా, శ్రీని వాస్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.