నియంతృత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది ..!

కరీంనగర్ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్.

సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 8, (జనం సాక్షి). నియంతృత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పాదయాత్రకు సంఘీభావంగా చేపట్టిన పాదయాత్రను అంబేద్కర్ చౌరస్తా వద్ద డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ జండా ఒకటి పాదయాత్ర ప్రారంభించారు. నేతన్న విగ్రహం వద్ద కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ సంఘీభావం తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నియంతృత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో రాహుల్ గాంధీ ఉద్దేశాలను ప్రజలకు వివరించేందుకు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే పాదయాత్రలో ప్రజలకు పరిస్థితులు వివరిస్తామని అన్నారు. పట్టణ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీల దుర్మార్గాలను ప్రజా వ్యతిరేక విధానాన్ని కడప గడపకు తీసుకువెళ్లి ఎండగడతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునురి బాలరాజు, బ్లాక్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజు,, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు