నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకుని వెళతా
అభివృద్దికి కేరాఫ్ టిఆర్‌ఎస్: ఎర్రబెల్లి
జనగామ,అక్టోబర్15(జనంసాక్షి): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నానని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగించారని అన్నారు. అందుకే తాను అనేక పథకాలకు నిధులు తెచ్చి అభివృద్ది చేశానని అన్నారు. మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని అన్నారు. దేశాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఏళ్లకొద్దీ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది శూన్యమని అన్నారు. ఎర్రబెల్లి సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగాఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. పాలకుర్తిలో ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేదన్నారు. డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌కు తనకు నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల నాయకులు సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పాలకుర్తిలో రౌడీలకు, గుండాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు తన్నితరిమి కొడతారని జోస్యం చెప్పారు. కరువు కాలంలో సీఎం కేసీఆర్ సహకారంతో గోదావరి జలాలతో చెరువులు నింపుతున్నానన్నారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనను తనను నమ్ముకుని పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హావిూ ఇచ్చారు. తనను నమ్ముకున్న కుటుంబాలను తప్పకుడా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. నియోజక వర్గాన్ని అభివృద్ధిలో మరింత ముందుస్తానన్నారు.