నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
బెల్లంపల్లి, ఆగస్టు 5, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో సింగరేణి భూమిలో ఇండ్ల పట్టాల మంజూరు గురించి, ఇటీవల కురిసిన అతిభారీ వర్షాలకు నియోజకవర్గంలో జరిగిన తీవ్ర నష్టాలు, రోడ్ల సమస్యల గురించి సీఎం కెసిఆర్ గారికి వివరించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రంలో కోరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వినతి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్
సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.