నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం కాంగ్రెస్ నాయకులు

సికింద్రాబాద్ డిసెంబర్ 05 ( జనం సాక్షి )
తెలంగాణ రాష్ట్రం సహకారమైన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అందరికీ అందుతాయని ఆశించినప్పటికీ కేవలం కెసిఆర్ ఆయన కుటుంబానికి మాత్రమే దక్కాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేసి,వారి ప్రాణాలకు వెలకట్టిన ఘనత ఆయనకే దక్కిందని మేడ్చల్ జిల్లా ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి ఆరోపించారు.స్థానిక కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన పల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూసాధారణ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో, ప్రజలకు అన్యాయం జరిగిందో ఓటు హక్కు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని,ప్రజల తీర్పు బట్టబయలైందని,తొమ్మిదిన్నర ఏండ్లు లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఆవినీతి పాలన ప్రజలు భరించారని,కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ,అధికారం అవినీతి పాలన కొనసాగించారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన తన పైన జంట నగరాలలోని పలుపోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి వేధించారని ఆరోపించారు. కేసులు పెట్టి తమను వేధించిన,వెనుతిరగకుండా,కెసిఆర్, అధికార పార్టీ ని నిలదీశామని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి బద్ది చెప్పారని, రేవంత్ రెడ్డి నాయకత్యంలో కక్ష పూరిత రాజకీియాలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అభివ్నద్ధి సంక్షేమంపాలన చేపట్టి మంచి పేరు వచ్చేలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని,
కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి. అనంతరం డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ఓటమి చెందిన నియోజక వర్గం డివిజనలో తమ పోరాటం మాత్రం ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనం మధ్య ఉంటామని వివరణ ఇచ్చారు,తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామని,కాంగ్రెస్ ప్రభుత్వహయాంలోప్రజలకు ఆరుగ్యారంటీలు చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు, రైతుకు,మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆర్థికంగా ఎదిగేందుకు అండగా నిలుస్తామని వివరించారు. కూకట్ పల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, డివిజన లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని,డివిజన్ లో నిత్యo అందుబాటు లో ఉంటాం అన్ని డివిజన్ ప్రెసిడెంట్ కావేటి మల్లికార్జునయాదవ్ తెలియజేశారు.ఈ సమావేశంలో అరుణ్ రెడ్డి ఎన్ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి,ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ ప్రెసిడెంట్ కావేటి మల్లికార్జున్ యాదవ్, రాయిని ఆనంద్ కాంగ్రెస్ సీనియర్ లీడర్,షాహిన్షా మైనార్టీ లీడర్,అరవింద్ గౌడ్ ఎన్ఎస్ యుఐ డివిజన్ ప్రెసిడెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.