నిరంతరం నేర్చుకోవడమే విజయ రహస్యం
` నేను డాక్టర్‌ను కాదు.. సోషల్ డాక్టర్‌ను
` వైద్యులు సామాజిక బాధ్యత మరవొద్దు
` సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి
` కానీ.. ప్రజల నాడి పట్టుకోవడం మరవొద్దు
` ఫెలోస్ ఇండియా కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలసీలు మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. సూచనలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు.. వైద్యులు స్వచ్ఛందంగా సీపీఆర్ నేర్పిస్తే చాలా మంది ప్రాణాలు కాపాడగలరని సీఎం అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను వైద్యుడిని కాకపోయినప్పటికీ.. సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే డాక్టర్‌నని సీఎం వ్యాఖ్యానించారు. వైద్యులు ప్రజలు, సమాజంపై తమ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని సీఎం అన్నారు. వైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని.. అయితే, ప్రజల నాడి పట్టుకోవడం మరిచిపోవద్దని సీఎం సూచించారు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్యులు కలిసి పనిచేద్దామని సీఎం అన్నారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తెలంగాణ ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
అప్‌గ్రేడ్ అయినా.. ప్రజల నాడి పట్టుకోవడం మరవొద్దు: సీఎం రేవంత్
లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ‘‘సమాజంపై విూ బాధ్యతను ఎప్పటికీ మరిచిపోవద్దు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వైద్యులు అధునాతన సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దు’’ అని తెలిపారు.



