నిరంతర ప్రత్యేక హోదా నమోదు కార్యక్రమం
ఎన్నికల స్వీప్ అధికారి భవాని ప్రసాద్
నల్గొండ బ్యూరో,జనం సాక్షి. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిరంతరం గా వుంటుందని,అర్హులైన ఓటర్ లను ఓటర్ జాబితా లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్వీప్ అధికారి భవానీ ప్రసాద్ అన్నారు. అన్నారు.గురువారం నల్గొండ అర్.డి. ఓ కార్యాలయం లో స్వీప్ కార్యక్రమాల పై ఆయన అర్.డి. ఓ.,ఇతర అధికారులతో సమీక్షించారు.ముఖ్యంగా అర్హులైన ఓటర్ లు జాబితా లో నమోదు,ఓటర్ జాబితా లో మార్పులు,చేర్పులు దరఖాస్తు చేయడం పై ఓటర్ లకు అవగాహన కలిగించాలని,సోషల్ మీడియా ద్వారా ఎన్నికల కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.సెక్స్ వర్కర్ లు,ట్రాన్స్ జెండర్ లు,దివ్యాంగులు ఓటర్ గా నమోదుకు సంబంధిత అధికారులు సమన్వయం తో చర్యలు తీసుకోవాలని అన్నారు.తొలుత నల్గొండ పట్టణం లోని చెన్న కేశవ పాఠశాల,ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల లలో పోలింగ్ బూత్ లు సందర్శించి బి.ఎల్. ఓ.లు పని తీరు పై తెలుసుకుని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి,డి. ఈ. ఓ.బిక్షపతి,డి.పి.అర్. ఓ.శ్రీనివాస్,డిప్యూటీ డి.యం.హెచ్. ఓ వేణు గోపాల్ రెడ్డి,తహశీల్దార్ నాగార్జున రెడ్డి,ఎన్నికల డి.టి.విజయ్, మహిళా,శిశు సంక్షేమ శాఖ,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, పాల్గొన్నారు.