నిరంతర విద్యుత్ ఘనత సిఎం కెసిఆర్‌దే
దళితబంధును కూడా పూర్తిచేసి చూపుతాం
బిజెపి పాలిత రాష్టాల్ల్రో దీని అమలు చేయాలి: జగదీశ్వర్ రెడ్డి
సూర్యాపేట,ఆగస్ట్10(జనం సాక్షి): తెలంగాణలో నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది సిఎం కెసిఆర్ మాత్రమేనని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఇలా విద్యుత్ కోతలు లేకుండా ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ అందడంలేదన్నారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో దీనిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పరనడానికి ఇదో ఉదాహరణ అన్నారు. దళితబంధును కూడా అంతే స్ఫూర్తితో ముందుకు తీసుకుని వెళతామన్నారు. తెలంగాణలో పాగా వేస్తామంటున్న బిజెపి నేతలు ముందుగా ప్రజలకు నిత్యావసరమైన కరెంట్‌ను తమ పాలిత రాష్టాల్ల్రో ఇవ్వాలని అన్నారు. అప్పుడే బిజెపిని ప్రజలు నమ్ముతారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను, రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్నది కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు ఎకరానికి 10వేల పెట్టుబడి, సీఎం కేసీఆర్‌ది ప్రజలందరికీ పారదర్శకంగా నిలిచే రామరాజ్య పాలన అని అన్నారు. రైతులు ఏవిధంగా మరణించినా రూ, 5 లక్షల బీమా అందిస్తోంది కేసీఆరే మాత్రమే అన్నారు. మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి పరచారన్నారు. చెరువులకు నీళ్లు కావాల్నా.. రైతుబీమా కావాలన్నా.. కెసిఆర్ కారణమని తెలిసి పోయిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓవైపు సంక్షమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిలోనూ అగ్రగామిగా రాష్టాన్న్రి నిలుపుతున్నారన్నారు. దేశంలోనే అభివృద్ధి పరంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్టాన్న్రి నంబర్‌వన్ స్థానంలో నిలిపి ఉత్తమ సీఎంగా గుర్తింపు పొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం
కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దానిని రెండువేలకు పెంచిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ఇప్పుడు దళితబంధును కూడా అమలు చేయబోతున్న ఘనత కూడా కెసిఆర్‌దే కానుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అమలుచేయగలమా అన్నది బిజెపి ఆలోచించాలన్నారు. దళితబంధుపై కాంగ్రెస్, బిజెపిలు విమర్శలు మాని తమ రాష్టాల్ల్రో అమలుకు ప్రయత్నాలు చేయాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి హితవు పలికారు.