నిరసనలకు హద్దుండాలి

4
– అరుణ్‌ జైట్లీ

నిరసనలకూ హద్దుండాలి: జైట్లీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌20 (జనంసాక్షి): నిరసన వ్యక్తం చేసే క్రమంలో దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతి కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హితవు పలికారు. దాడులు మన విధానం కాదన్నారు. జమ్మూ కశ్మీర్‌ ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేపై ఇంక్‌ దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ఇంక్‌ దాడులు పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. తాజాగా జమూకశ్మీర్‌ స్వంత్ర ఎమ్మెల్యే ఇంజనీర్‌ రషీద్‌పై కొందరు సిరా దాడి చేయడం పెను దుమారం రేపింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు పెరిగాయంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వ్యవహారంపై స్పందించారు. తమ నిరసన వ్యక్తం చేయడానికి దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవుపలికారు. ఈ సందర్భంగా మంగళవారం అరుణ్‌జైట్లీ విూడియాతో మాట్లాడుతూ… తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికో, నిరసన తెలపడానికో ఇలాంటి దాడులను ఒక సాధనంగా మార్చుకున్నారని అన్నారు. భారత్‌ లాంటి సువీశాల దేశంలో అనేక అంశాలపై విభిన్న దృష్టికోణాలు ఉంటాయని…ఆ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి మర్యాద పూర్వకమైన మార్గాన్ని అనుసరించడం మన సంప్రదాయమని ఆయన అన్నారు.