నిరుద్యోగ యువతకు శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతీ, యవకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను అందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్‌ యోజన పథకం ఒక సదవకాశమని ప్రాజెక్టు డైరెక్టర్‌ బైరపాక రవీందర్‌ తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం, సుమతి కార్పొరేట్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో 18 నుంచి 26 ఏళ్ల వయస్సు కలిగి, 10వ తరగతి పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతీ, యువకులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఆసక్తి గల వారికి నిపుణులచే శిక్షణ ఇస్తామని, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌, లైఫ్‌స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన వారికి ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌, అగ్రికల్చర్‌ సీడ్‌ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలను ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తిగల వారు వరంగల్‌ హంటర్‌రోడ్డులోని మెడికేర్‌ ఆస్పత్రి పక్కన ఉన్న ట్రైనింగ్‌ సెంటర్‌లో  సంప్రదించాలని కోరారు.